టెక్ ఉద్యోగంపై కేవల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు: తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఉద్యోగి
రిపోర్టర్: వెంకట్
స్థలం: చెన్నై
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ జోహోలో పనిచేసిన అనుభవం తనను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ కేవల్ అగర్వాల్ వెల్లడించారు. 2015 నుంచి 2018 మధ్యకాలంలో చెన్నైలోని జోహోలో పనిచేసిన ఆ కాలం తన జీవితంలో అత్యంత కఠినమైన దశగా మారిందని ఆయన పేర్కొన్నారు. కంపెనీపై తనకు ఎటువంటి కోపం లేనప్పటికీ, వర్క్‌ప్లేస్ సరిపోకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి కోడింగ్ అంటేనే అసహ్యం వేసిందని లింక్‌ఇన్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.