ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం భక్తులకు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. దసరా సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గత ఏడు రోజుల్లో పది లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి కొల్లు పార్థసారథి పేర్కొన్నారు.