సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్ సిబ్బందిపై దాడి జరగలేదు: డీసీపీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పీఆర్వో, పీఏలపై ఎలాంటి దాడి జరగలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించామని, డీజే అనుమతి కోసం వచ్చిన కొందరు యువకులు కేటీఆర్ సిబ్బందిని చూసి వాగ్వాదానికి దిగారే తప్ప దాడి జరగలేదని వివరించారు. పోలీసుల ఈ వివరణపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.