సుప్రీంకోర్టుకు వెళ్లకుండా దానం నాగేందర్ రాజీనామా చేయాలి
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దానం పై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకుని మిగిలిన వాళ్లతో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు.