రాష్ట్రంలో స్ట్రక్చర్డ్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి కొరత రాకుండా నిరుపయోగ ప్రభుత్వ భూములతో స్ట్రక్చర్డ్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి శాఖ, జిల్లా మూడు నెలల యాక్షన్‌ క్యాలెండర్‌తో గడువులోగా ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. ఇగోలు పక్కనపెట్టి ప్రజాసేవకులుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌ అంశాలకు తక్షణమే పరిష్కారం చూపాలని తేల్చిచెప్పారు.