నర్సీపట్నంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలతో అసాంఘిక శక్తుల గుండెల్లో దడ
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం యాతపేట మరియు పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని పదిహేడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.