అంటువ్యాధుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి సత్యకుమార్
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగీ, టైపాయిడ్ వంటి వ్యాధుల కట్టడికి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కేసుల రిపోర్టింగ్‌కు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన తేల్చిచెప్పారు.