పంజాబ్లో ఆప్ డోర్ టూ డోర్ ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం భగవంత్ మాన్
రిపోర్టర్: అశోక్
స్థలం: Punjab
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధూరి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రవ్యాప్త ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఉచిత విద్యుత్, వైద్యం, పాఠశాలల అభివృద్ధి వంటి సంక్షేమ చర్యల ద్వారా కుటుంబానికి రూ. 1.80 లక్షల వరకు ఆదా అవుతోందని మాన్ తెలిపారు. కాంగ్రెస్, శిరోమణి అకాళీదళ్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని ఎద్దేవా చేశారు.