బ్రహ్మోత్సవాల్లో చిన్నారులు వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో తప్పిపోయే చిన్నారులు, వృద్ధుల రక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు.