రాజకీయ పార్టీ ప్రకటన వాయిదా: ఆయుర్వేద చికిత్సకు వెళ్తున్న విజయసాయిరెడ్డి
రిపోర్టర్: మహేష్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. మంగళవారం నుంచి వారం రోజుల పాటు ఆయుర్వేద చికిత్స నిమిత్తం వెళుతున్నానని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే కొత్త పార్టీ ఆవిర్భావ దినోత్సవ తేదీని అధికారికంగా ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి చేసిన తాజా పోస్ట్ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.