బంజరు భూమిని కొబ్బరి తోటగా మార్చిన నటుడు మాధవన్.

రిపోర్టర్: మహేష్ స్థలం: తమిళనాడు

తమిళనాడులోని పళని సమీపంలో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన బంధువుతో కలిసి ఒక బంజరు భూమిని సఫలమైన కొబ్బరి తోటగా మార్చారు. సుమారు మూడేళ్ల శ్రమ తర్వాత సేంద్రీయ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఈ భూమిని జీవనాధారమైన తోటగా తీర్చిదిద్దారు. సహజ పద్ధతులను అనుసరిస్తూ స్థానిక రైతులకు కూడా తక్కువ ధరకే మొక్కలను అందించడం విశేషం.