'రైతాంగం కోసం జీవితాన్ని అంకితం చేశారు': సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం
రిపోర్టర్: మహేష్
స్థలం: Telangana
రైతాంగం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. కౌలు రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఆయన చేసిన పోరాటాలు మరువలేనివని ప్రశంసించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.