ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు తొలిరోజే భారీగా తరలివచ్చారు. గవర్నర్ దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల వరకు 75 వేల మందికిపైగా భక్తులు గణనాథుడిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ నెల 25న నిమజ్జనం జరగనుంది.