గంజాయి కట్టడికి విశాఖలో దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్: మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో గంజాయి మరియు మాదకద్రవ్యాల కట్టడి కోసం పొరుగు రాష్ట్రాలతో సమన్వయం నిమిత్తం త్వరలో విశాఖపట్నంలో దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్ నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరియు సరిహద్దు చెక్పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఈ భేటీలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు.