ఆర్టీసీ ప్రైవేటీకరణపై చంద్రబాబు సర్కార్ తీరుపై జేఏసీ ఫైర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో దశలవారీగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర పన్నుతోందని ఆర్టీసీ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తూ, రెండవ దశలో 1450 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని మండిపడింది. జేఏసీ చర్చలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని హెచ్చరించింది.