ఆధ్యాత్మిక చిత్రం జయహో రామానుజ ట్రైలర్ విడుదల: ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జయహో రామానుజ సినిమా ఈ నెల ఇరవై నాల్గవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దర్శకుడు లయన్ సాయి వెంకట్ తెలిపారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్ను ఘనంగా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేసిన రామానుజుల గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సాయి వెంకట్ వెల్లడించారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.