అర్నబ్ తుపాను నష్టంపై సమీక్ష: ఉప్పాడ తీర రక్షణకు పవన్ కల్యాణ్ ఆదేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: కాకినాడ

అర్నబ్ తుపాను నేపథ్యంలో కాకినాడ జిల్లాలో జరిగిన నష్టంపై అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు మరియు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, రక్షణ గోడ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. తుపాను వల్ల భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు.