ఇరాన్ ఆయుధ కొనుగోళ్లపై ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా
రిపోర్టర్: రాము
స్థలం: అమెరికా
ఇరాన్‌కు ఆయుధాల కొనుగోలులో సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వివిధ దేశాలకు చెందిన పది సంస్థలు మరియు వ్యక్తులపై అమెరికా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని క్షీణింపజేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక ఆంక్షల ప్రభావంతో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పాతాళానికి పడిపోయిందని అధికారులు తెలిపారు. టెహ్రాన్ రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడమే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా వెల్లడించింది.