ప్రజాసేవలో పాతికేళ్లు పూర్తి: ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఢిల్లీ

ప్రజాసేవలో వరుసగా ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని వికసిత్ భారత్ సంకల్ప్ సభలో కీలక ప్రసంగం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థుల విమర్శలే తనకు రాజకీయంగా మరింత బలాన్ని చేకూరుస్తాయని స్పష్టం చేశారు. అలాగే దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.