తీవ్ర విషాదం: మాజీ ఎంపీ అయినాబత్తుల బుచ్చిబాబు కన్నుమూత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Dr. B.R. Ambedkar Konaseema

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశేష సేవలందించిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే అయినాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చిమహేశ్వరరావు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గోపవరం గ్రామంలో జన్మించిన ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించారు. అల్లవరం ఎమ్మెల్యేగా, అమలాపురం ఎంపీగా ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.