నెల్లూరు కాలువకట్ట నిర్వాసితులకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు సర్వేపల్లి కాలువకట్టపై దశాబ్దాలుగా నివసిస్తున్న 1,215 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగూరు నారాయణ ఇచ్చిన హామీని నెరవేర్చడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపితమైంది. పట్టాల కోసం ఎదురుచూసిన పేదల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. స్థానికులు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి సంబరాలు జరుపుకున్నారు.