చిన్నారిపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణం శాంతిఖని బస్తీలో బాధిత పాప వారి ఇంటి ముందు ఆడుకుంటుండగా వారి ఇంటికి దగ్గరలో ఉండే కాంపెల కిష్టయ్య పాపను తన ఇంటికి తీసుకొనివెళ్లి పాప మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనితో పాప భయపడి పోయి ఏడ్చుకుంటూ వారి ఇంటికి పరిగెత్తుకొని రాగ పాప తల్లి విషయం తెలుసుకొని పిర్యాదు ఇవ్వగా బెల్లంపల్లి 2 టౌన్ ఎస్సై సి హెచ్ తిరుపతి కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి హెచ్ హనోక్ కేసు దర్యాప్తు చేసి ఆదివారం మధ్యాహ్నం సమయంలో నిందుతుడు కాంపెల కిష్టయ్య ను అరెస్ట్ చేసి న్యాయ స్థానం ముందు హాజరుపరిచగా మేజిస్ట్రేట్ నిందుతుడిని రిమాండు కు పంపించారు.