అభిమాన నాయకుని మృతితో వినాయక చతుర్ధి వేడుకలకు దూరం..

రిపోర్టర్: Srinivasarao Ummidisetti స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడిలో వినాయక చవితి వేడుకలకు గ్రామస్థులు దూరంగా ఉన్నారు. తమ అభిమాన నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి చెందటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. ఏనుగువీధి చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ హాలు, ఊర చెరువు వీధి రామాలయం, మరికొన్ని చోట్ల ముద్రగడ అభిమానులు తమ నాయకుడిపై అభిమానాన్ని ఆత్మీయతను చాటుకుంటూ వినాయకుని ఉత్సవాలకు దూరంగా ఉండటం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషాద వాతావరణంలో పండుగ నిర్వహణను పూర్తిగా నిలిపివేశారు.