ఈదులనాగులపల్లి భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీలో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఈదులనాగులపల్లి భూముల వ్యవహారంపై జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వే నంబర్లు 134, 135లో కోర్టు స్టే ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి నకిలీ పట్టాలు సృష్టించారని, ఈ వివాదాస్పద భూముల కొనుగోలు జాబితాలో నందమూరి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఈ భారీ ల్యాండ్ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.