టీజీఎస్పీడీసీఎల్ ఘనత: నాలుగు అంతర్జాతీయ నాణ్యతా గుర్తింపులు దక్కించుకున్న విద్యుత్ సంస్థ
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
విద్యుత్ పంపిణీ రంగంలో నాణ్యతా ప్రమాణాలు, సమాచార భద్రతలో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని అధిగమించిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ నాలుగు గుర్తింపులను స్వీకరించారు. ఐఎస్ఓ 9001, ఐఎస్ఓ 27001 లతో పాటు జపనీస్ 5ఎస్ విధానం, క్వాలిటీ మార్క్ గుర్తింపులు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.