వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కిషన్ రెడ్డి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల అరాచకాలకు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ వీరోచిత పోరాటం సాగించారని ఆయన కొనియాడారు. తన నేల కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన రాజీలేని పోరాటం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని వెల్లడించారు.