విమానంలో నటి కీర్తి సురేష్‌కు చేదు అనుభవం: మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
మిలాన్ నుంచి ఇండియాకు వస్తున్న విమానంలో ప్రముఖ నటి కీర్తి సురేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి సెల్ఫీ కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడని కీర్తి సురేష్ వెల్లడించారు. తాను నిరాకరించినప్పటికీ ఆ వ్యక్తి వినకుండా వేధించాడని, చివరికి భర్త ఆంటోనీ తట్టిల్ జోక్యం చేసుకుని సిబ్బంది సాయంతో అతడిని నిలువరించారని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు.