తెలంగాణ సచివాలయంలో మంచినీటి కొరత కలకలం: నిలిచిన వాటర్ క్యాన్ల సరఫరా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని తెలంగాణ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంచినీటి సరఫరా నిలిచిపోయినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. సుమారు యాభై లక్షల రూపాయల బిల్లుల బకాయిలు పెండింగ్లో ఉండటంతో ప్రైవేటు ఏజెన్సీలు వాటర్ క్యాన్ల సరఫరాను ఆపేశాయి. దీంతో ఉద్యోగులు స్వయంగా వాటర్ బాటిళ్లను తెచ్చుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన పరిపాలనా కేంద్రంలోనే తాగునీరు నిలిచిపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.