నాయుడుపేటలో పోలేరమ్మ తల్లికి నిమ్మకాయల అలంకరణ
రిపోర్టర్: Darla Venkateswarlu
స్థలం: నాయుడుపేట
నాయుడుపేట శ్రీశ్రీశ్రీ గ్రామదేవత పోలేరమ్మ తల్లి దేవస్థానంలో నాల్గవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని నిమ్మకాయలతో విశేషంగా అలంకరించారు.
ఈ పవిత్ర దినాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.