గౌరాయిపల్లి రామాలయంలో మోదీ ఆయురారోగ్యాలకై వెలిగిన దీపాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం అటల్ బిహారీ వాజ్ పాయ్ సందర్శించిన గ్రామం గౌరాయిపల్లి రామాలయంలో ప్రధాని మోదీ పుట్టిన రోజు మరియు 25 సంవత్సరాల ప్రజాపాలన సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ బీజేపీ నేతలు ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కదూరీ అచ్చయ్య, కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షులు గుంటిపల్లి మహేశ్వరి సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు పోషెట్టి తదితరులు పాల్గొన్నారు.