పారిశుద్ధ్య లోపంతో దోమల విజృంభణ ఆందోళనలో నెల్లూరు నగర ప్రజలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ ఫాగింగ్, స్ప్రేయింగ్ ప్రక్రియ నామమాత్రంగానే సాగుతోందని, ఫలితంగా డెంగీ, మలేరియా వంటి జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.