కాంగ్రెస్ లో చేరిక
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి . కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్‌లోని గౌరవ కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి గారి నివాసంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్, గడ్డమీది తాండా గ్రామ పంచాయతీలకు చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.