కుక్కునూరులో ఏఎన్ఎంల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో నిరసన

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సచివాలయ ఏఎన్ఎంలు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ సాలరీ డిమాండ్లను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టామని సంఘం సభ్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించే వరకు ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీల్లో ఆన్లైన్ పనులను నిలిపివేసి, నిరసనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.