స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ కోసం పది లక్షల పాఠశాలలు
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా పదకొండు లక్షల పదహారు వేలకు పైగా పాఠశాలలు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిశుభ్రత పచ్చదనం స్థిరమైన అభివృద్ధి పౌర బాధ్యతలను పెంపొందించే ఈ ప్రత్యేక కార్యక్రమం కింద అర్హత కలిగిన అన్ని విద్యాసంస్థలు అక్టోబర్ పదవ తేదీ నాటికి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.