ఈడీ ఉచ్చు: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ భూముల కొనుగోలులో భారీ అవినీతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mohali

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చేపట్టిన భూముల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించిందని అధికారులు వెల్లడించారు. అమృత్సర్, బటిండా ప్రాంతాలలో రూ. 77.99 కోట్ల విలువైన భూములను అత్యధిక ధరలకు కొనుగోలు చేశారని ఈడీ పేర్కొంది. ఈ లావాదేవీలపై క్రిమినల్ కుట్ర, మోసం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మొహాలి ఎస్ఎస్పీని ఆదేశించారు. తక్కువ ధరకు కొన్న భూములను నెలల వ్యవధిలోనే అసోసియేషన్ కు భారీ ధరలకు విక్రయించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.