మహారాష్ట్రలో బోల్తా పడిన పాల ట్యాంకర్ పాలను ఎత్తుకెళ్లిన స్థానికులు

రిపోర్టర్: గోపి స్థలం: పాల్గఢ్

మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో గుజరాత్ నుంచి ముంబైకి వెళ్తున్న పాల ట్యాంకర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది. దహాను తాలూకా తవా గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్యాంకర్ నుంచి వందలాది లీటర్ల పాలు రోడ్డుపైకి ఒలికిపోయాయి. రోడ్డుపై పాలు పారడాన్ని గమనించిన స్థానికులు బాటిల్స్, డబ్బాలతో ఎగబడి పాలను ఎత్తుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రమాదం వల్ల రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.