బీహార్ లో ఉపాధ్యాయుల డ్రెస్ కోడ్ ఖరారు: పాఠశాలల్ లో డీజేలకు పూర్తి నిషేధం

రిపోర్టర్: కిరణ్ స్థలం: పాట్నా

పాఠశాలల్ లో ఉపాధ్యాయులు, సిబ్బంది ఫార్మల్ డ్రెస్ కోడ్ కచ్చితంగా పాటించాలని బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ స్పష్టం చేశారు. క్యాంపస్లలో డీజేలు, డిస్కోల వినియోగంపై నిషేధం విధిస్తూ ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యాలయాల్ లో క్రమశిక్షణను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉపాధ్యాయుల ప్రవర్తన, వస్త్రధారణ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు. జీన్స్, టీ-షర్టులు వేసుకుని రావడంపై శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.