రైతన్నలకు రియా ఏఐ వరం: పంట సాగులో కొత్త శకమన్న ఎమ్మెల్యే

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఘంటసాల

ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో రియా రైతు మిత్ర వరి సలహా వాణి ఏఐ అగ్రికల్చర్ అసిస్టెంట్ యాప్ను అందుబాటులోకి తేవడం అభినందనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో సాంకేతికతను రైతులకు చేరువ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వరి సాగులో మెరుగైన సలహాలు అందుతాయని, అన్నదాతలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సేవలు రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.