నేటితో ముగియనున్న క్యాట్ 2026 దరఖాస్తుల గడువు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

భారతీయ మేనేజ్‌మెంట్ సంస్థలు నిర్వహించనున్న కామన్ అడ్మిన్ టెస్ట్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు పొడిగించిన గడువు సెప్టెంబర్ 22న ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 4 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. నవంబర్ 29న క్యాట్ పరీక్ష జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1350 కాగా, ఇతరులకు రూ. 2700గా నిర్ణయించారు.