పిడుగు శబ్దాలకు భయపడి ఇద్దరు వృద్ధ మహిళలు మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో భారీ వర్షం సమయంలో పిడుగుల శబ్దాలకు భయపడి ఇద్దరు వృద్ధ మహిళలు గుండెపోటుతో మృతి చెందారు. పెట్లూరివారిపాలెంకు చెందిన తల్లపనేని నాగమ్మ, లక్ష్మీపురానికి చెందిన మేకల వెంకాయమ్మ తీవ్ర శబ్దాలకు ఒక్కసారిగా భయాందోళనకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.