యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం: బీహార్ జట్టు కెప్టెన్గా నియామకం
రిపోర్టర్: రమేష్
స్థలం: పాట్నా
కేవలం పదిహేనేళ్ల వయసున్న యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బీహార్ సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్గా నియమితులయ్యారని బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్ష వర్ధన్ తెలిపారు. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ లో పదిహేడు మంది సభ్యులతో కూడిన జట్టును ఆయన నడిపించనున్నారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అద్భుతమైన ప్రదర్శనలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ యువ ఆటగాడికి అరుదైన బాధ్యత దక్కిందని అధికారులు స్పష్టం చేశారు.