కారు పై కూలిన వేపచెట్టు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల పట్టణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కాటమయ్య కాలనీలో వేపచెట్టు కూలి ఓ కారుపై పడింది. దీంతో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అయితే ఘటన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో చెట్టు ఒక్కసారిగా నేలకొరిగి కారుపై పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.