ఏపీ డిగ్రీ ప్రవేశాల మొదటి విడత సీట్ల కేటాయింపు విడుదల

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. బీఏ, బీఎస్సీ, బీకామ్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కోరే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cap.apcfss.in ద్వారా తమ సీట్లను చెక్ చేసుకోవచ్చు. లాగిన్ వివరాలు నమోదు చేసి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.