పెద్దిరెడ్డితో సునీల్ కుమార్ భేటీతో పూతలపట్టులో మరింత వేడెక్కిన రాజకీయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బంగారుపాళెం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై పలు కీలకమైన అంశాలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.