భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు విమాన సర్వీసులు రద్దు

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి విశాఖ, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలు, దట్టమైన మేఘాల కారణంగా పలు విమానాలు ల్యాండ్ కాలేక ఇతర ప్రాంతాలకు దారి మళ్లగా, మరికొన్ని సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. భోగాపురం బయలుదేరిన మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ప్రయాణిస్తున్న విమానం సిగ్నల్ సమస్యతో నాగపూర్‌కు మళ్లించబడింది.