జిమ్ ట్రైనర్ హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

దక్షిণ ఢిల్లీలోని ఫతేపూర్ బెరిలో జిమ్ ట్రైనర్ విజయ్ లోహియా హత్య కలకలం రేపింది. ఈ హత్యకు గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు సోషల్ మీడియా వేదికగా బాధ్యత వహించాడు. "భాగనే సే కామ్ నహీ చలేగా, ఫీల్డ్ మే ఆవో" అంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేశాడు. పాత కక్షల నేపథ్యంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు.