ప్రియుడి మోజులో పడి కన్నతల్లిని పొట్టనబెట్టుకున్న కసాయి కూతురు
రిపోర్టర్: నరేష్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రియుడి కోసం కన్నతల్లిని కూతురు దారుణంగా హత్య చేసింది. బంగారం, డబ్బుల కోసం ప్రియుడు రాజాతో కలిసి తల్లి లక్ష్మిని కడతేర్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను విచారిస్తున్నారు.