ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఉండే ఆహార ఉత్పత్తులపై ముందు భాగంలోనే హెచ్చరికలు ముద్రించాలని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాన్ని పరిశీలించాలని ఎఫ్ఎస్ఎస్‌ఏఐ సహా సంబంధిత వర్గాలను న్యాయస్థానం ఆదేశించింది.