రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే మా ప్రధాన ప్రాధాన్యత: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: సురేష్ స్థలం: సూర్యాపేట

రాజకీయాలకు అతీతంగా బాధ్యతాయుతమైన విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నిపుణుల పర్యవేక్షణలో పూర్తిగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొంటూ ప్రజలకు భరోసా కల్పించారు.