అక్టోబర్ రెండో వారం నుంచి బాలకృష్ణ-కొరటాల శివ సినిమా షూటింగ్

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య, అక్టోబర్ మొదటి వారం నుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు.